మహిళల టి20 ఆసియా కప్ విజేత భారత్
● మహిళల టి20 ఆసియా కప్ 2026
(Women's T20 Asia Cup 2026) టోర్నీ 2026 ఆగస్టు 28 - సెప్టెంబర్ 13 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయ్) వేదికగా జరిగింది.
● మహిళల ఆసియా కప్ (Asia Cup) 2026 విజేతగా భారత్ నిలిచింది.
● శ్రీలంకతో జరిగిన ఫైనల్లో టీమ్ఇండియా 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
● ఇప్పటి వరకు ఆసియా కప్ 10 సార్లు జరగ్గా.. భారత్
8 సార్లు విజేతగా నిలిచింది. (2004,
2005-06, 2006, 2008, 2012, 2016, 2022, 2026).
● ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (ఫైనల్) : షెఫాలీ వర్మ.
● 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' : దీప్తి శర్మ
● టోర్నీ లో అత్యధిక పరుగులు (Most Runs) : షెఫాలీ వర్మ (236 పరుగులు)
● అత్యధిక వికెట్లు (Most Wickets) : దీప్తి శర్మ (14 వికెట్లు)
● అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్
ఇయర్‌లో అత్యధిక (39) వికెట్లు పడగొట్టిన
భారత బౌలర్‌గా శ్రీ చరణి నిలిచింది. పూనమ్ యాదవ్ (35 వికెట్లు, 2018)ని శ్రీ చరణి అధిగమించింది.
యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత జ్వెరెవ్
● జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో
టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
● ఫైనల్ మ్యాచ్‌లో అమెరికా కుర్రాడు బెన్ షెల్టన్‌ను 6-3, 7-6(2), 5-7,
6-2 తేడాతో ఓడించాడు.
● జ్వెరెవ్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2026 ఫ్రెంచ్ ఓపెన్ (రోలాండ్ గారోస్)లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్
గెలిచాడు.
యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత రిబకినా
● యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను రిబకినా (కజకిస్థాన్) సాధించింది. సబలెంకా
(బెలారస్)పై 6-4, 5-7, 6-2 తేడాతో గెలుపొందింది.
● రిబకినాకు ఇదే మొదటి యుఎస్ ఓపెన్ టైటిల్.
● ఈ విజయంతో ఆమె మహిళల టెన్నిస్ అసోసియేషన్ (WTA) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ ఘనత సాధించిన మొదటి కజకిస్థాన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
●
పికిల్‌బాల్ ప్రపంచ కప్ 2026
● పికిల్‌బాల్ ప్రపంచ కప్ పోటీలు ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 6, 2026 వరకు వియత్నాం లోని దానాంగ్ (Da Nang) నగరం వేదికగా జరిగాయి.
● ఆసియా ఖండంలో ఈ టోర్నమెంట్ జరగడం ఇదే తొలిసారి.
● పతకాల పట్టికలో TOP 1.వియత్నాం 2.
దక్షిణ కొరియా 3. అమెరికా.
● భారత్ మొత్తం 41 పతకాలు (7 స్వర్ణాలు, 17 రజతాలు, 17 కాంస్యాలు) తో 4వ స్థానంలో నిలిచింది.
20వ ఆసియా క్రీడలు 2026
● వేదిక: జపాన్ లోని నగోయా మరియు ఐచి నగరాలు.
● సమయం: సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4,
2026 వరకు.
● మస్కట్: హోనోహోన్ (HONOHON).
● జపాన్ (ఐచి-నగోయా) లో ప్రారంభమైన 20వ ఆసియా క్రీడల ప్రారంభోత్సవంలో భారత్ తరపున మనూ భాకర్ (షూటింగ్) మరియు పవన్ సహ్రావత్
(కబడ్డీ) పతాకదారులుగా (Flag Bearers) వ్యవహరించారు.
● 45 దేశాల క్రీడాకారులు ఈ గేమ్స్‌లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి 30కి పైగా క్రీడల్లో 503 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
● 2022లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో పతకాల పట్టికలో 28 బంగారు పతకాలతో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
చరిత్ర సృష్టించిన ధీరజ్
● ఆంధ్రప్రదేశ్ యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర చరిత్ర సృష్టించాడు.
● సాల్టిలో (మెక్సికో) జరిగిన ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో పురుషుల రికర్వ్
స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా అతడు ఘనత సాధించాడు.
● ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత్ నుంచి మహిళల విభాగంలో డోలా బెనర్జీ (2007)
మాత్రమే రికర్వ్ పసిడి నెగ్గింది.
జూనియర్ హాకీ ఆసియా కప్
● ఆసియా కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్(AHF Junior Asia Cup 2026)లో భారత మహిళల జట్టు, పురుషుల జట్టు స్వర్ణాలు సాధించాయి.
● చైనాతో జరిగిన ఫైనల్‌లో భారత మహిళా జట్టు 1-0 తేడాతో గెలుపొందింది.
● భారత మహిళల జట్టు ఈ కప్‌ను గెలుచుకోవడం ఇది వరుసగా మూడోసారి (2023,2024,2026)
● ఫైనల్‌లో భారత్ పురుషుల జట్టు 4-1 తేడాతో కొరియాను ఓడించింది.
● భారత్ పురుషుల జట్టుకు ఇది వరుసగా నాలుగో టైటిల్ (2015, 2023,
2024,2026).
చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ-2026
● చైనా లోని షెంజెన్‌లో ఈ టోర్నీ జరిగింది.
● పురుషుల సింగిల్స్: హాంగ్‌కాంగ్‌కు చెందిన జాసన్ గుణవన్ విజేత.
● మహిళల సింగిల్స్: దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సే యాంగ్ విజేత.
● పురుషుల డబుల్స్: భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట చైనా జంటను ఓడించి విజేతగా నిలిచింది.
ఈ టైటిల్ సాధించిన తొలి భారతీయ జంటగా వీరు రికార్డు సృష్టించారు.
వరల్డ్ పారా ఆర్చరీ స్టేజ్ 3 పోటీలు
● భారత్ వేదికగా తొలిసారిగా జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్ స్టేజ్-3
(World Archery Para Series Stage 3 - 2026) పోటీలు గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో 2026 సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 9 వరకు జరిగాయి
● మొత్తం భారత్ పతకాలు: 15 (4 స్వర్ణాలు,
3 రజతాలు, 8 కాంస్యాలు)
● భారత్ 2వ స్థానంలో నిలవగా,
5 పసిడి పతకాలతో చెక్ రిపబ్లిక్ అగ్రస్థానంలో నిలిచింది.
స్మృతి మంధాన కొత్త ప్రపంచ రికార్డులు
● అత్యధిక అంతర్జాతీయ పరుగులు: 10,880 పరుగులు సాధించి మిథాలి రాజ్ (10,868)ను అధిగమించింది.
● అత్యధిక శతకాలు: 18 అంతర్జాతీయ శతకాలతో
మెగ్ లానింగ్ (17), లారా వోల్వార్ట్ (17)లను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది.
● స్మృతి మందాన మహిళల టి20 అంతర్జాతీయ క్రికెట్‌లో
అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. ఆమె న్యూజిలాండ్ క్రీడాకారిణి సుజీ
బేట్స్ (4758 పరుగులు) రికార్డును
అధిగమించి, 4788 పరుగులతో అగ్రస్థానంలోకి
చేరారు.
సంక్షిప్త సమాచారం
● అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో అత్యధికంగా
150 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా (సారధ్యం) వ్యవహరించిన
ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా (పురుషులు & మహిళల విభాగంలో) హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించారు.
సంక్షిప్త సమాచారం
● ఇండియన్ ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్ 2026: పురుషుల విభాగం: లాలియాంజువాలా ఛాంగ్తే (మిజోరాం) మహిళల విభాగం: మనీషా కల్యాణ్ (పంజాబ్).
● అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్
ప్రకటించారు కెరీర్ ముఖ్యాంశాలు: జెర్సీ నంబర్: 10. అంతర్జాతీయ గోల్స్: 125. బాలన్ డి ఓర్ (Ballon d'Or) అవార్డులు: 8 సార్లు (అత్యధికం).
విజయాలు : 2022 FIFA వరల్డ్ కప్,
2021 & 2024 కోపా అమెరికా కప్‌లు,
2008 ఒలింపిక్ స్వర్ణం.
● టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్
సెంచరీ (30 బంతుల్లో- ఆఫ్గనిస్తాన్
పై) సాధించిన శాశ్వత సభ్య దేశం బ్యాటర్‌గా & భారత్ తరఫున ఫాస్టెస్ట్
సెంచరీ చేసిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ రికార్డు
సృష్టించాడు. ప్రపంచ రికార్డు (సైప్రస్‌పై 27 బంతుల్లో) ఎస్తోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది
● దులీప్ ట్రోఫీలో అత్యంత పిన్న వయసులోనే (15 ఏళ్ల 157 రోజులు) అర్ధ సెంచరీ
చేసిన తొలి బ్యాటర్‌గా ఈస్ట్ జోన్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ నిలిచాడు
● 2027 ఉమెన్స్ ICC ఛాంపియన్స్ ట్రోఫీ తొలి
ఎడిషన్‌కు భారత్ (ముంబై, వడోదర) ఆతిథ్యం ఇవ్వనుంది
● భారత స్క్వాష్ ప్లేయర్ అభయ్ సింగ్, హాంగ్‌కాంగ్‌కు చెందిన ఎన్డీ లుంగ్‌పై విజయం సాధించి తొలిసారి ప్రతిష్టాత్మక తువాంగ్
మొహిరిజ్ ట్రోఫీ 2026 టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
● చెక్ రిపబ్లిక్‌లో జరిగిన WTT ఫీడర్ ఒలోమోక్ 2026
(టేబుల్ టెన్నిస్) టోర్నీలో భారత టేబుల్ టెన్నిస్
క్రీడాకారుడు అంకుర్ భట్టాచార్జీ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు.
● జపాన్ లోని ఐచి-నగోయా వేదికగా 2026 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న 20వ ఆసియా క్రీడల అధికారిక మస్కట్‌గా 'హొనొహొన్' (HONOHON) ఎంపికైంది. జపనీస్ భాషలో 'హొనొహొ' అంటే 'మంట' అని అర్థం
● భారత పారా ఆర్చరీ రత్నం శీతల్ దేవి అహ్మదాబాద్‌లో జరిగిన ఖేలో ఇండియా పారా ఆర్చరీ
పాయింట్స్ సిరీస్‌లో మహిళల ఓపెన్ కాంపౌండ్ కేటగిరీలో తన తొలి వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని
కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు.
● దులీప్ ట్రోఫీ విజేతగా ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ నిలిచింది. దులీప్
ట్రోఫీ గెలుచుకోవడం ఈస్ట్‌కు ఇది మూడోసారి.
రన్నరప్ సౌత్ జోన్
● జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన పిన్న వయస్కురాలిగా దిల్లీ బాలిక
నైరా శర్మ (10 ఏళ్ల 3 నెలలు) ఘనత సాధించింది.
● భారత యువ షట్లర్ తన్వి పత్రి చెంగ్డూ (చైనా) లో జరిగిన ఆసియా అండర్-17 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచింది.
● భారత యువ షట్లర్ ఇషారాణి బారువా వియత్నాం ఓపెన్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది.
● విశాఖకు చెందిన యువ చెస్ క్రీడాకారిణి ఎం.సాహితి వర్షిణి మహిళల గ్రాండ్ మాస్టర్
(డబ్ల్యూజీఎం) హోదా సాధించింది.
● భారత స్పిన్నర్ శ్రీచరణి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకొని, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 800 పాయింట్ల మార్క్‌ను దాటిన భారత తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.
● ఐసీసీ (International Cricket Council) డిప్యూటీ చైర్మన్‌గా జింబాబ్వేకు చెందిన తవెంగ్వా ముకుహ్లాని
నియమితులయ్యారు.
● భారత మహిళల హాకీ చరిత్రలో అత్యధికంగా 321 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన గోల్‌కీపర్‌గా సవితా పూనియా రికార్డు
సృష్టించారు.
● భారతదేశం తొలిసారిగా 2028 సంవత్సరంలో 11వ ఆసియా సీనియర్ వుషు ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం
ఇవ్వనుంది.
● అత్యంత పిన్న వయసు(11ఏళ్లు)లో మహిళా గ్రాండ్‌మాస్టర్
హోదా సాధించిన ప్లేయర్‌గా భారత సంతతికి చెందిన బోధన శివానందన్(బ్రిటన్)రికార్డు సృష్టించింది.
● ఉజ్బెకిస్థాన్ లోని సమర్‌కండ్ లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషులు,
మహిళల జట్లు వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించాయి.
● మహిళల ఆంధ్ర ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) తొలి సీజన్ ఛాంపియన్‌గా రాయలసీమ
జెన్ స్టార్స్ అవతరించింది.
● చైనాలోని షాంఘైలో జరిగిన 48వ వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్
2026 పోటీలలో భారతదేశం 10వ స్థానంలో నిలిచింది (6 సిల్వర్, 20 మెడల్స్ ఫర్ ఎక్సలెన్స్).
● 2028 వరకు భారత క్రికెట్‌కు సంబంధించి BCCI టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను ముత్తూట్ ఫిన్‌కార్ప్ దక్కించుకుంది.
● భారతదేశం లోని పూణే (మహారాష్ట్ర) నగరం 2032 సైక్లింగ్ రోడ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
పుస్తకాలు & రచయిత
● 'భూపేన్ హజారికా: 100 ఇయర్స్ ఆఫ్ ఏ వండరింగ్
సాంగ్' (Bhupen Hazarika: 100 Years of a Wandering Song) పుస్తక రచయితలు / ఎడిటర్లు: అంకురన్ దత్తా మరియు నాని గోపాల్
మహంత.
భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ గారు అస్సాంలోని గౌహతిలో
జరిగిన భూపేన్ హజారికా గారి 100వ జయంతి వేడుకల్లో ఈ
పుస్తకాన్ని అధికారికంగా విడుదల చేశారు
● 'అపరాజిత' (Aparajita) పుస్తకం రచయిత్రి: అరుంధతి
భట్టాచార్య (SBI మాజీ తొలి మహిళా చైర్‌పర్సన్).
ఆమె ఆంగ్ల ఆత్మకథ (Memoir) "Indomitable: A Working Woman's Notes on
Work, Life and Leadership" యొక్క హిందీ అనువాదమే
ఈ 'అపరాజిత'.
