2026 September CA for International Events

ekalavyacurrentaffairs.blogspot
By -
0

 

2026 September CA for International Events

అంతర్జాతీయం & ఇండియా - వరల్డ్

సరికొత్త ప్రపంచ పటం

●            దేశాల భౌగోళిక సరిహద్దులు, ఖండాల పరిమాణంపై శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉన్న ప్రఖ్యాత మెర్కేటర్‌ ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి స్వస్తి పలికింది. దాని స్థానంలో సరికొత్త వరల్డ్‌ మ్యాప్‌ (World Map)ను ఆవిష్కరిస్తూ చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది.

●            నూతన ప్రపంచ పటంలో ఆఫ్రికా పరిమాణం పెద్దగా కన్పిస్తుండగా.. ఐరోపా, ఉత్తర అమెరికా సైజు కుచించుకుపోయింది.

●            ఐరాస (United Nations) సర్వసభ్య సమావేశంలో ఆఫ్రికాలోని టోగో దేశం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి 164 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి.

●            ఒక్క అమెరికా మాత్రం దీన్ని వ్యతిరేకించింది. మరో ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

●            ఖండాల అసలు విస్తీర్ణానికి అనుగుణంగా సమాన భూమి ప్రాతిపదికన ఈ కొత్త ప్రపంచపటాన్ని రూపొందించారు. ఇక నుంచి ఈ కొత్త మ్యాప్‌నే వినియోగించాలని సభ్య దేశాలను ఐరాస కోరింది.

●            మారిటైం నేవిగేషన్‌ కోసం 1569లో ప్రముఖ కార్టోగ్రాఫర్‌ గెరార్డస్‌ మెర్కేటర్‌ ప్రపంచ పటాన్ని గీశారు. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అప్పట్లో భూభాగాల ఆకృతులు, కోణాలను కచ్చితత్వంతో చూపించడంపైనే దృష్టిపెట్టి ఈ మ్యాప్‌ను రూపొందించారు.

ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లలో మోదీ పర్యటన

●            ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 1 వరకు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్‌లలో నాలుగు రోజుల పాటు పర్యటించారు.

●            ఇది ఉజ్బెకిస్థాన్‌లో మోదీకి నాలుగో పర్యటన.

●            ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షుడు షావ్కత్‌ మిర్జియోయెవ్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ ఆగస్టు 30న తాష్కెంట్‌లో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకువెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయానికి వచ్చారు.

●            ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 కోట్ల డాలర్లకు (సుమారు రూ.47,690 కోట్లు) పెంచుకోవాలని భారత్‌-ఉజ్బెకిస్థాన్‌ నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం ఇది 100 కోట్ల డాలర్లుగా ఉంది.

●            వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, అరుదైన ఖనిజాలు, గనుల తవ్వకం, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఔషధాలు, ఆరోగ్యం, సమాచార సాంకేతికత, యూపీఐ సహా డిజిటల్‌ వ్యవస్థలు, విద్య.. ఈ రంగాల్లో సహకారంపై చర్చలు ప్రధానంగా కేంద్రీకృతమయ్యాయి. 11 ఒప్పందాలకు సంబంధించిన అవగాహన పత్రాలను ఇరు దేశాల బృందాలు పరస్పరం మార్చుకున్నాయి.

●            ఉజ్బెకిస్థాన్‌లో UPI సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 12 దేశాల్లో ఈ సేవలు ఉన్నాయి.

●            తాష్కెంట్‌ లోని భారత మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి విగ్రహానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు.

●            విదేశీ నేతలకు ఇచ్చే ఉజ్బెకిస్థాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ఓలీ దరాజాలి దోస్తిక్' (Order of Oli Darajali Dostic) ను ప్రధాని మోదీకి బహుకరించారు. దీంతో ప్రధాని మోదీ అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 36కు చేరింది.

●            భారత పౌరుల కోసం ఉజ్బెకిస్థాన్‌ 30 రోజుల వీసా రహిత (వీసా-ఫ్రీ) విధానాన్ని ప్రకటించింది.

●            కిర్గిజ్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు బిష్కెక్‌లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పాల్గొని ప్రసంగించారు.

●            కిర్గిస్థాన్‌ లో ఎస్‌సీవో దేశాల ఇతర నేతలతో కలిసి ఆరో వరల్డ్‌ నోమాడ్‌ గేమ్స్‌ ప్రారంభ వేడుకలకు మోదీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు.

●            బిష్కెక్‌లో మహాత్మా గాంధీ స్మారకాన్ని మోదీ సందర్శించారు.

ఇండియా - శ్రీలంక ఒప్పందాలు

●            శ్రీలంక వైమానిక దళానికి (Sri Lankan Air Force) చెం దిన L70 గన్ల ఆధునీకరణ (Upgradation & Modernization) కోసం భారత్ - శ్రీలంకల మధ్య ఒప్పం దం కుదిరింది.

●            భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు సెప్టెంబర్ 8 నుండి 10 వరకు శ్రీలంకలో పర్యటించారు. ఈ పర్యటనలో శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయకే, ప్రధాని హరిణి అమరసూర్యలతో భేటీ అయ్యారు.

●            NCC యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్: భారత్ NCC మరి యు శ్రీలంక నేషనల్ డిఫెన్స్ కాలేజ్ యూత్ మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు అగ్రీ మెంట్ కుదిరింది

●            Note: శ్రీలంకను ముంచెత్తిన 'దిత్వ' తుఫాను (Cyclone Dithwah) సమయంలో భారత్ 'ఆపరేషన్ సాగర్ బంధు' ద్వారా త్వరితగతిన బెయిలీ బ్రిడ్జెస్‌ను (Bailey Bridges) ఉచితంగా అందించి సహాయపడింది

ప్రపంచంలోనే మొదటి కృత్రిమ ఇంధన ద్వీపం

●            ప్రపంచం లోనే మొదటి కృత్రిమ ఇంధన ద్వీపం (World's First Artificial Energy Island)ను బెల్జియం దేశం నిర్మిస్తోంది.

●            ఉత్తర సముద్రంలో (North Sea) సముద్ర తీరం నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో "ప్రిన్సెస్ ఎలిజబెత్ ఐలాండ్" (Princess Elisabeth Island) పేరుతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు.

●            నిర్మాణ రకం: సముద్రంలో మానవ నిర్మిత సబ్‌స్టేషన్ హబ్ (High Voltage Electricity Hub).

●            నిర్వహణ సంస్థ: బెల్జియన్ విద్యుత్ గ్రిడ్ ఆపరేటర్ 'ఎలియా' (Elia).

యూకే బ్రేక్ అవే ప్యాక్ట్ (UK Breakaway Pact)

●            యునైటెడ్ కింగ్డమ్ (UK) నాలుగు ప్రాంతాల కలయిక (ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్).

●            తాజా వివాదం: స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్, మరియు వేల్స్ నాయకులు యూకే నుండి విడిపోయి, తిరిగి యూరోపియన్ యూనియన్ (EU) లో చేరాలనే ప్రతిపాదనతో "UK Breakaway Pact" పై సంతకాలు చేశారు.

●            యూకే ప్రధాని ఈ విచ్ఛిన్న ప్రతిపాదనను తిరస్కరించారు.

●            NOTE: యూరోపియన్ యూనియన్‌లో ప్రస్తుతం 27 దేశాలు ఉన్నాయి, ప్రధాన కార్యాలయం: బ్రస్సెల్స్, బెల్జియం).

అంతర్జాతీయ బాల్య వివాహాల వ్యతిరేక దినం (నవంబర్ 27)

●            ప్రతి సంవత్సరం నవంబర్ 27న బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినంగా పాటించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు ఇచ్చింది.

●            సియోర్రా లియోన్ నేతృత్వంలో రూపొందించిన ఈ తీర్మానాన్ని 193 మంది సభ్యులు గల ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ఏకాభిప్రాయంతో ఆమోదించింది.

సముద్ర మట్టం పెరుగుదలపై UN తొలి ప్రకటన

●            ఐక్యరాజ్యసమితి (UN) చరిత్రలోనే మొదటిసారిగా సముద్ర మట్టం పెరుగుదల (Sea Level Rise) పై ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేసింది.

●            న్యూయార్క్‌లో జరిగిన 81వ UN జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాల సందర్భంగా దీనిని తీసుకువచ్చారు.

●            లక్ష్యం: క్లైమేట్ చేంజ్ వల్ల ముంపునకు గురవుతున్న చిన్న చిన్న ద్వీప దేశాలకు (Small Island Developing States - SIDS) రక్షణ కల్పించడం

●            SIDS సమూహం: ఇందులో 39 సభ్య దేశాలు మరియు 18 అసోసియేట్ మెంబర్లు ఉన్నాయి (ఉదా: మాల్దీవులు, ఫిజీ, సేషెల్స్, మారిషస్)

●            Note : 1989 మాలే డిక్లరేషన్ : గ్లోబల్ వార్మింగ్ మరియు సీ లెవెల్ రైజ్‌పై మాల్దీవుల రాజధాని మాలేలో ఆమోదించబడిన తొలి ప్రాంతీయ ఒప్పందం.

●            2026 UN డిక్లరేషన్ : ఐక్యరాజ్యసమితి (UN) అధికారికంగా నేరుగా 'సముద్ర మట్టం పెరుగుదల'పై జారీ చేసిన తొలి గ్లోబల్ డిక్లరేషన్.

సైబర్ నేరాలపై UN ఒప్పందంపై భారత్ సంతకం

●            ఐక్యరాజ్యసమితి రూపొందించిన చారిత్రాత్మక సైబర్ నేరాల నిరోధక ఒప్పందంపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ న్యూయార్క్‌లో సంతకం చేశారు.

●            డిసెంబర్ 2024లో UN ఆమోదించిన ఈ కన్వెన్షన్, అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ నేరాలను అరికట్టడానికి రూపొందించిన తొలి చట్టబద్ధమైన ఒప్పందం.

బెల్జియం ప్రధాని బార్ట్ డి వేవర్ భారత్ పర్యటన

●            బెల్జియం ప్రధాని బార్ట్ డి వేవర్ (Bart De Wever) సెప్టెంబర్ 2 నుండి 4, 2026 వరకు భారతదేశంలో 3 రోజుల అధికారిక పర్యటన చేశారు.

●            ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

●            ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే ఐదేళ్లలో రెట్టింపు చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. దీంతోపాటు రక్షణ సంబంధాల మెరుగు, పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారం వంటి అంశాలపై 5 ఒప్పందాలపై రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.

●            రక్షణ రంగ పరిశ్రమలపై మరో 10 ఒప్పందాలు కుదిరాయి. బెల్జియం సైన్యం అందించే సాంకేతికతతో మన దేశంలో రాకెట్లు తయారు చేయడం దీనిలో ఒకటి.

భారత్ - రష్యా ద్వైపాక్షిక సంబంధాలు

●            బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

●            $100 బిలియన్ల వాణిజ్య లక్ష్యం: 2030 కల్లా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రస్తుత వాణిజ్య పరిస్థితి (2025-26)

●            ద్వైపాక్షిక వాణిజ్యం: ~$59.86 బిలియన్లు.

●            భారత్‌కు రష్యాతో వాణిజ్య లోటు (Trade Deficit) ~$50.87 బిలియన్లు ఉంది.

●            సుకోయ్-30 MKI ఇంజన్లు: భారత వైమానిక దళం (IAF) ఉపయోగిస్తున్న సుకోయ్-30 MKI ఫైటర్ జెట్ల కోసం అడ్వాన్స్డ్ 'Izdeliye 177S' ఇంజన్లను అందిస్తామని రష్యా ఆఫర్ చేసింది.

●            Note: సుకోయ్-30 అనేది 4.5 జెనరేషన్ విమానం. భారత్ స్వదేశీంగా అభివృద్ధి చేస్తున్న 'AMCA' మాత్రమే 5th జనరేషన్ ఫైటర్ జెట్.

●            బ్రిక్స్ సదస్సుకు హాజరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ తమిళ పవిత్ర గ్రంథమైన ‘తిరుక్కురళ్’ యొక్కర ష్యన్ అనువాద ప్రతిని బహుమతిగా అందించారు.

తాత్కాలిక జాబితా (Tentative List) లో చేరిన 4 కొత్త ప్రదేశాలు

●            1. కొలోనియల్ పీనల్ సెటిల్మెంట్ ఆఫ్ అండమాన్ ఐలాండ్స్ (అండమాన్ & నికోబార్): సెల్యులార్ జైల్, రాస్ ఐలాండ్ (సుభాష్ చంద్రబోస్ ఐలాండ్), వైపర్ ఐలాండ్ వంటివి ఉన్నాయి.

●            2. నికోబార్స్ కల్చరల్ కంటిన్యూటీ (నికోబార్ ఐలాండ్స్): నికోబారీస్ తెగకు చెందిన విశిష్ట సంస్కృతి, జీవన విధానం, సాంప్రదాయ నిర్మాణాలు మరియు ప్రకృతితో వారి సంబంధాన్ని చాటిచెబుతుంది

●            3.రంగ్పూర్ శివసాగర్ హిస్టారిక్ ఎన్సెంబల్ (అస్సాం): అహోమ్ రాజవంశం (Ahom Dynasty) నాటి వాస్తుశిల్పం, ఇంజనీరింగ్, రంగ్ఘర్ (అంఫీ థియేటర్), తలాతల్ ఘర్ (ప్యాలెస్) మరియు నీటి నిర్వహణ వ్యవస్థల విశిష్టతను తెల్పుతుంది.

●            4.ద పెయింటెడ్ హవేలీ టౌన్స్ ఆఫ్ శేఖావతి (రాజస్థాన్): 18 నుండి 20వ శతాబ్దం నాటి వర్తకులు నిర్మించిన అందమైన హవేలీలు, వాటి గోడలపై రామాయణ/మహాభారత కథలు, చారిత్రక ఘట్టాలు.

●            Note: భారతదేశం నుండి 4 కొత్త ప్రదేశాలు చేరడంతో టెంటేటివ్ లిస్ట్‌లో ఉన్న మొత్తం ప్రదేశాల సంఖ్య 73కి చేరింది. ఇందులో 53 సాంస్కృతిక (Cultural), 17 సహజ (Natural), 3 మిశ్రమ (Mixed) ప్రదేశాలు ఉన్నాయి.

●            ఏదైనా ఒక ప్రదేశాన్ని UNESCO ప్రపంచ వారసత్వ సంపదగా (World Heritage Site) గుర్తించాలంటే ముందుగా దానిని తప్పనిసరిగా 'తాత్కాలిక జాబితా' (Tentative List) లో చేర్చాలి.

●            భారతదేశం నుండి ఈ నామినేషన్లను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సమర్పిస్తుంది.

●            UNESCO 1972 వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్‌ను ఆమోదించగా, భారత్ దీనిని 1977లో రాటిఫై (ఆమోదం) చేసింది.

UNESCO వారసత్వ తాత్కాలిక జాబితా

●            భారతదేశం నుండి 5 కొత్త ప్రదేశాలు UNESCO తాత్కాలిక వారసత్వ జాబితాలో చేరాయి.

●            భారతదేశం నుండి ఈ జాబితాలో ఉన్న ప్రదేశాల సంఖ్య 78కి పెరిగింది.

●            చేర్చబడిన ప్రదేశాలు:

●            ఉదయగిరి గుహలు (మధ్యప్రదేశ్): గుప్తుల కాలం నాటి రాతి నిర్మాణ సమూహాలు (4వ - 5వ శతాబ్దం).

●            బాగ్ గుహ చిత్రాలు (మధ్యప్రదేశ్): వింధ్య శ్రేణుల్లో బాఘినీ నది ఒడ్డున ఉన్న 9 బౌద్ధ గుహలు.

●            గిన్నొర్ గఢ్ కోట (మధ్యప్రదేశ్): రాజ్‌గోండ్ రాజుల చారిత్రక రాజధాని కోట.

●            చంబల్ లోయ దేవాలయాల సమూహం (మధ్యప్రదేశ్): బతేశ్వర్, పడావళి, కకర్మథ్ దేవాలయాలు.

●            సత్యాగ్రహ ప్రదేశాలు (భారత్ & దక్షిణాఫ్రికా): గాంధీజీ సత్యాగ్రహ పరిణామాన్ని తెలిపే 9 ప్రదేశాలు (దక్షిణాఫ్రికాలో 2, భారత్‌లో 7).

●            Note: ప్రస్తుతం భారత్‌లో 45 UNESCO శాశ్వత ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి (45వది: ఉత్తరప్రదేశ్ లోని సార్నాథ్). ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వారసత్వ ప్రదేశాలు కలిగిన దేశాల్లో భారత్ 6వ స్థానంలో ఉంది.

సింధూ జలాల ఒప్పందం - హేగ్ కోర్టు తీర్పును తిరస్కరించిన భారత్

●            జమ్మూ కశ్మీర్‌ లోని జలవిద్యుత్ ప్రాజెక్టుల వివాదంపై ది హేగ్ ఆర్బిట్రేషన్ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ ఖండించింది.

●            భారత్ వైఖరి: ప్రపంచ బ్యాంక్ ప్రోద్బలంతో ఈ కోర్టును చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేశారని, ఇండస్ వాటర్ ట్రీటీ (IWT) నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన ఈ ఉత్తర్వులను అంగీకరించబోమని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

●            Note : 1960 సెప్టెంబర్ 19న భారత్-పాకిస్తాన్ మధ్య వరల్డ్ బ్యాంక్ (ప్రపంచ బ్యాంక్) మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరింది.

●            2025 ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

●            సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన మధ్యంతర చర్యలు, ఒప్పంద స్థితిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్  తీర్పు జారీ చేసింది.

●            ఈ ఒప్పందం ఇంకా అమల్లోనే ఉందని, దాన్ని నిలిపివేయడానికి భారత్‌కు సరైన కారణం లేదని కోర్టు పేర్కొంది. అలాగే జమ్మూకశ్మీర్‌ లోని రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కొన్ని అంశాలపై కూడా కోర్టు ఆంక్షలు విధించింది. అయితే ఈ తీర్పును భారత్ పూర్తిగా తిరస్కరించింది.

ఆర్కిటిక్ డిఫెన్స్ అగ్రిమెంట్

●            గ్రీన్లాండ్ భద్రత మరియు ఆర్కిటిక్ రక్షణ కోసం అమెరికా, డెన్మార్క్, గ్రీన్లాండ్ దేశాలు ఈ నూతన ఒప్పందంపై సంతకాలు చేశాయి (1951 ఒప్పంద సవరణ).

●            చైనా మరియు రష్యాల నుండి ఆర్కిటిక్ ప్రాంతాన్ని కాపాడటానికి నాటో (NATO) మద్దతుతో ఈ ఒప్పందం రూపొందింది.

భద్రతా మండలిలో భారత్ సభ్యత్వానికి విసెగ్రాడ్ గ్రూప్ మద్దతు

●            సెంట్రల్ యూరోపియన్ దేశాల కూటమి విసెగ్రాడ్ (V4), ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు ప్రకటించింది.

●            సభ్య దేశాలు: పోలాండ్, హంగేరీ, స్లొవేకియా, చెక్ రిపబ్లిక్.

●            నేపథ్యం: న్యూయార్క్‌లో జరిగిన UNGA 81వ సమావేశం సందర్బంగా భారత విదేశాంగ మంత్రి S. జైశంకర్‌తో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన వచ్చింది.

సంక్షిప్త సమాచారం

●            ఆగ్నేయాసియా ప్రాంతంలో రేబీస్ (Rabies) వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన మొదటి దేశంగా భూటాన్ నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనికి సంబంధించిన ధృవీకరణను అందించింది.

Note: రేబీస్ వ్యాధి లిస్సా వైరస్ (Lyssavirus) వల్ల వస్తుంది మరియు ఇది ఒక జూనోటిక్ (Zoonotic) వ్యాధి

●            2026-27 సంవత్సరానికి గాను పాకిస్తాన్‌లోని లాహోర్ నగరాన్ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) పర్యాటక మరియు సాంస్కృతిక రాజధానిగా ప్రకటించారు.

●            థాయ్‌లాండ్‌లోని థాంగ్ ఫా ఫుమ్ నేషనల్ పార్కు ప్రాంతంలో Thismia daemona అనే కొత్త పువ్వుల జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

●            చంద్రుడు, అంగారకుడిపై శాంతియుత అన్వేషణ, పరస్పర సహకారం కోసం నాసా రూపొందించిన 'ఆర్టెమిస్ అకార్డ్స్'లో టర్కియే అధికారికంగా 71వ భాగస్వామ్య దేశంగా చేరింది.

ఆర్టెమిస్ అకార్డ్స్ :  బాహ్య రోదసిలో పౌర అన్వేషణ, శాంతియుత కార్యకలాపాల కోసం ఉమ్మడి ప్రమాణాలను నిర్దేశిస్తూ 2020లో ఈ ఒప్పందాన్ని ప్రారంభించారు.

నాసా, అమెరికా విదేశాంగ శాఖతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జపాన్, లక్సెంబర్గ్, యూఏఈ, యూకే తదితర ఏడు వ్యవస్థాపక దేశాలు సంయుక్తంగా దీనికి రూపకల్పన చేశాయి. ఇండియా కూడా సంతకం చేసింది.

●            EU లో చేరాలా వద్దా అని ఐస్లాండ్ లో నిర్వహించిన రెఫరెండంలో 52.8% ప్రజలు చేరడానికి నిరాకరించారు. ప్రధాని: క్రిస్టన్ ఫ్రోస్టా డోటిర్.

●            ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో అణువాయుధాల తయారీకి ఉపయోగించే యురేనియం జాడలను గుర్తుందించడం వల్ల ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) ఈ చర్య తీసుకుంది. IAEA గవర్నింగ్ కౌన్సిల్‌లోని 35 దేశాలలో 23 దేశాలు ఫిర్యాదుకు అనుకూలంగా ఓటు వేయగా, చైనా, రష్యా, మరియు నైజర్ దేశాలు వ్యతిరేకించాయి.

Note: IAEA ఏర్పాటు: జులై 29, 1957. HQ: వియన్నా (ఆస్ట్రియా),డైరెక్టర్ జనరల్: రాఫెల్ మారియానో గ్రోసి (అర్జెంటీనా).

●            నేపాల్‌ లోని కాట్మండులో జరిగిన SAWEN (South Asia Wildlife Enforcement Network) మొదటి జనరల్ అసెంబ్లీలో అక్రమ వన్యప్రాణి వ్యాపారాన్ని అరికట్టడానికి కాట్మండు డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా ఆమోదించారు.

●            భారత్ మరియు వియత్నాం దేశాల మధ్య దౌత్య సంబంధాలు (Diplomatic Relations) ప్రారంభమై 55 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2027 సంవత్సరాన్ని "భారత్-వియత్నాం స్నేహ సంవత్సరం" (Year of India-Vietnam Friendship) గా పాటించాలని నిర్ణయించారు.

●            పసిఫిక్ మహాసముద్ర ద్వీప దేశమైన ఫిజీ (Fiji) దేశంలో హెచ్‌ఐవి కేసులు విపరీతంగా పెరగడంతో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మాదకద్రవ్యాల వాడకం మరియు ఒకే సిరంజీని పలువురు వాడటం (బూటూయింగ్ / ఆర్ట్ స్పాటింగ్) ఇందుకు ప్రధాన కారణాలుగా గుర్తించారు. ఫిజీ రాజధాని: సువా

●            ‘నౌరూ’గా పరిచయం ఉన్న తమ దేశం ఇప్పుడు ‘నౌయెరో’గా మారిందని ఆ దేశ అధ్యక్షుడైన డేవిడ్‌ అడియాంగ్‌ ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పేర్కొన్నారు. 8 చదరపు మైళ్ల విస్తీర్ణం, 12 వేల జనాభా గల దక్షిణ పసిఫిక్‌ దీవి ‘నౌయెరో’ ప్రపంచంలో అతి చిన్న దేశాల్లో మూడోస్థానంలో ఉంది.

●            కోలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ (CSC) ఆధ్వర్యంలో 'టేబుల్ టాప్ ఎక్సర్‌సైజ్ 2026’ సెప్టెంబర్ 9 నుండి 12, 2026 (3 రోజుల వ్యాయామం) వరకు ఈస్టర్న్ నేవల్ కమాండ్ (ENC), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) లో జరిగింది.

కోలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ (CSC) 2011లో భారత్, శ్రీలంక, మాల్దీవుల మధ్య త్రైపాక్షిక భద్రతా వేదికగా ప్రారంభమైంది.

సభ్య దేశాలు (6): భారత్, శ్రీలంక, మాల్దీవులు, మోరీషస్, బంగ్లాదేశ్, సీషెల్స్. సచివాలయం: కొలంబో, శ్రీలంక.

●            రష్యా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుతం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క యునైటెడ్ రష్యా పార్టీ (450 సీట్లకు గాను 355 సీట్లు గెలుచుకుంది) ఘన విజయం సాధించింది.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!