BRICKS 2026 UPDATE FOR ALL JOBS, APPSC, TSPSC, CONSTABLE, SI, APDSC

ekalavyacurrentaffairs.blogspot
By -
0

 

BRICKS 2026 UPDATE FOR ALL JOBS, APPSC, TSPSC, CONSTABLE, SI, APDSC

18వ బ్రిక్స్ సదస్సు

●            18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు భారతదేశ అధ్యకతన న్యూఢిల్లీ లోని భారత్ మండపంలో సెప్టెంబర్ 12-13, 2026 తేదీలలో విజయవంతంగా జరిగింది.

●            ఈ సందర్భంగా బ్రిక్స్ కూటమి 'న్యూ ఢిల్లీ డిక్లరేషన్' ను ఆమోదించింది.

●            సదస్సు థీమ్: "Building for Resilience, Innovation, Cooperation and Sustainability”

●            2026 జనవరి 1న భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. భారత్ అధ్యక్షత వహించిన 4వ బ్రిక్స్ సదస్సు ఇది (గతంలో 2012, 2016, 2021).

న్యూ ఢిల్లీ డిక్లరేషన్ 4 ప్రధాన స్తంభాలు (Key Pillars)

●            రెజిలియన్స్ (Resilience): ఆర్థిక సంక్షోభాలు, సప్లై చైన్ సమస్యలను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడం.

●            ఇన్నోవేషన్ (Innovation): స్టార్టప్‌లు మరియు డీప్-టెక్ ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడం.

●            కోఆపరేషన్ (Cooperation): 'గ్లోబల్ సౌత్' (Global South) అభివృద్ధి కోసం సహకారాన్ని అందించడం.

●            సస్టైనబిలిటీ (Sustainability): వాతావరణ మార్పులపై పోరాటం మరియు సుస్థిర అభివృద్ధి సాధన.

●            ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి మినహాయింపులు లేని (Zero Tolerance) విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలను నిరసించింది.

●            ఐక్యరాజ్యసమితి పరిధి లోని కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం (CCIT) ని త్వరితగతిన ఆమోదించాలని స్పష్టం చేశారు.

●            ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మరియు యెమెన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో శాంతి భద్రతల పునరుద్ధరణకు డిమాండ్ చేశారు.

●            దేశాల మధ్య తలెత్తే వివాదాలను ఏకపక్ష యుద్ధాల ద్వారా కాకుండా దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.

●            ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా అంతర్జాతీయంగా వ్యాపార నిరోధక చర్యలు పెరగడాన్ని తప్పుబట్టింది. ఆర్థిక వృద్ధికి చోదకులుగా, నేతలుగా మహిళలను గుర్తిస్తున్నామని సదస్సు ప్రకటించింది.

●            బ్రిక్స్‌ సదస్సుకు 11 సభ్య దేశాల, 10 భాగస్వామ్య దేశాల నేతలు హాజరయ్యారు.

●            చైనా, రష్యా అధినేతలు షీ జిన్‌పింగ్, వ్లాదిమిర్‌ పుతిన్, ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్, అబుధాబి యువరాజు మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్,దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా, మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబొవో సుబియాంతో, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌-సిసి, ఇథియోపియా ప్రధాని అబియ్‌ అహ్మద్‌ అలీ, వియత్నాం ప్రధాని లీ మిన్‌ హంగ్‌లతో పాటు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కూడా సదస్సులో పాల్గొన్నారు.

●            19వ బ్రిక్స్‌ సదస్సు 2027 లో చైనాలో జరగనుంది.

●            Note: బ్రిక్స్ (BRICS) ఆవిర్భావం: 2006 (మొదటి సదస్సు 2009, యెకాటెరిన్ బర్గ్, రష్యా).

●            నామకరణం: 'BRIC' అనే పదాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ (Jim O'Neill).

●            దక్షిణాఫ్రికా చేరిక: 2010లో చేరింది (2011 సదస్సు నుంచి హాజరైంది).

●            మొత్తం సభ్య దేశాలు (11): బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE).

●            న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB): ప్రధాన కార్యాలయం - షాంఘై, చైనా.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!